Ramachandra Guha: మేము కూడా మనుషులమే.. రామచంద్ర గుహకు వేడివేడి భోజనం వడ్డించాం: ఏసీపీ కె.గౌడ

  • చట్టం ముందు అందరూ సమానమే
  • ప్రతి ఒక్కరినీ మేము గౌరవంగా చూస్తాం
  • మా అదుపులో ఉన్న అందరికీ శాకాహార భోజనం తెప్పించాం
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టౌన్ హాల్ వద్ద నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

దీనిపై ఏసీపీ కె.గౌడ మాట్లాడుతూ, ముందు తాము మనుషులమని, ఆ తర్వాతే ఖాకీలమని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని... అందుకే ప్రతి ఒక్కరినీ తాము గౌరవంగా చూస్తామని తెలిపారు. గుహతో పాటు మరి కొందరు కొన్ని గంటల సేపు తమ అదుపులో ఉన్నారని.... భోజన సమయంలో వారికి పక్కనున్న హోటల్ నుంచి శాకాహార భోజనం తెప్పించామని చెప్పారు. టొమాటో బాత్, సాంబార్, రసం, అన్నం, పెరుగుతో వేడివేడి భోజనాన్ని వారికి వడ్డించామని తెలిపారు.
Ramachandra Guha
Bengaluru
CAA

More Telugu News