Chandrababu: అసలు విషయమేమిటంటే, అమరావతిలో సుజనా చౌదరికి భూములున్నాయి: విజయసాయి రెడ్డి

  • రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్ర పరిధిలో ఉండదు
  • ఈ విషయం చట్టసభల సభ్యులందరికీ తెలుసు
  • బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారు
  • సుజనా మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదంటున్నారు
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై బీజేపీ నేత సుజనా చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని కూడా ఆయన తెలిపారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ పలు ఆరోపణలు గుప్పించారు.  

'రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని చట్టసభల సభ్యులందరికీ తెలుసు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కోవర్టు సుజనా చౌదరి మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడు. అసలు విషయమేమిటంటే, అమరావతిలో ఆయనకు భూములున్నాయి' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Chandrababu
YSRCP
Vijay Sai Reddy

More Telugu News