BJP: సంక్రాంతి శుభకరం కాదట.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా!

  • ఈ నెల 17 నాటికే పూర్తి కావాల్సిన అధ్యక్ష ఎన్నిక
  • ఇప్పటికే 18 రాష్ట్రాల్లో పూర్తయిన సంస్థాగత ఎన్నికలు
  • సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. సంక్రాంతి రోజులు శుభకరం కాదనే ఉద్దేశంతోనే ఎన్నికలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఈ నెల 17 నాటికే ఈ ఎన్నికలు పూర్తికావాల్సి ఉంది. పార్టీ నియమావళి ప్రకారం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన వెంటనే అధ్యక్ష ఎన్నికలు చేపట్టే అవకాశం ఉండగా, ఇప్పటికే 18 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే, సంక్రాంతి రోజులు మంచివి కాదనే ఉద్దేశంతోనే ఎన్నికను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. సంక్రాంతి ముగిసిన తర్వాత అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
BJP
national chief
Elections

More Telugu News