TS RTC starting Cargo services: జనవరి 1 నుంచి కార్గో సేవలు ప్రారంభించనున్న తెలంగాణ ఆర్టీసీ

  • కార్గో సేవలందించే బస్సులకు ఎరుపు రంగు  
  • ఢ్రైవర్లూ.. సిబ్బందికీ ప్రత్యేక డ్రెస్ కోడ్
  • నష్టాలనుంచి ఆర్టీసీ గట్టెక్కడానికే ఈ ప్రయత్నమన్న అధికారులు
నష్టాలతో నడుస్తున్న తెలంగాణ ఆర్టీసీని బయటపడేసేందుకు యాజమాన్యం నడుంబిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సరకు రవాణా(కార్గో) సేవలను ప్రారంభించనుంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై పలు దఫాలుగా చర్చించి.. జనవరి 1నుంచి  ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సేవలకోసం ఉపయోగించే బస్సులు ఎరుపు రంగులో ఉంటాయని అధికారులు తెలిపారు. కార్గో బస్సు డ్రైవర్, ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి ప్రజాప్రతినిధులు కూడా బస్సులో ప్రయాణించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ వారికి లేఖలు రాశారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో కలిసి వన భోజనాలు ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు.
TS RTC starting Cargo services
From 2020 january 1st
Telangana

More Telugu News