Jagan: సొంత జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్న జగన్

  • 23 నుంచి 25 వరకు కడప జిల్లాలో జగన్ పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
  • 24, 25 తేదీల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు
ముఖ్యమంత్రి జగన్ తన సొంత జిల్లా కడపలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా 23న కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 24న రాయచోటిలో పర్యటించనున్నారు. 25న పులివెందులలో వైద్య కళాశాలతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 24, 25 తేదీల్లో ఇడుపులపాయ, పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలసి ప్రార్థనలను నిర్వహిస్తారు.

Jagan
Kadapa

More Telugu News