Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కాదు.. రెండు రోజులే

  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
  • తొలుత అనుకున్నట్టు 10 రోజులు ఉండదన్న వైవీ సుబ్బారెడ్డి
  • తిరుమలకు విచ్చేసిన స్వరూపానంద సరస్వతి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తొలుత అనుకున్నట్టుగా 10 రోజులు ఉండదని చెప్పారు. తిరుమలకు వచ్చిన విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతిని టీటీడీ ఛైర్మన్, ఆలయ ప్రధాన అర్చకుడు కలిశారు. అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉత్సవమూర్తుల విగ్రహాల అరుగుదల అంశాన్ని స్వామీజీ దృష్టికి అర్చకులు తీసుకొచ్చారని... చారిత్రక ఆలయాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని స్వామీజీ చెప్పారని తెలిపారు. ఈ నెల 21 వరకు స్వరూపానంద సరస్వతి తిరుమలలోనే బస చేయనున్నారు.
Tirumala
YV Subba Reddy

More Telugu News