Tollywood: అలీ తల్లి జైతున్ బీబీ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు

  • అలీ నివాసానికి వెళ్లిన చిరంజీవి 
  • ఓదార్చి.. ధైర్యం చెప్పిన మెగాస్టార్
  • అలీ తల్లికి ‘మా’ నివాళులు
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతున్ బీబీ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ కు తరలించారు. అలీ నివాసానికి ప్రముఖ నటుడు చిరంజీవి వెళ్లారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అలీని ఓదార్చి ఆయనకు ధైర్యం చెప్పారు. జైతున్ బీబీ ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. కాగా, ఈరోజు సాయంత్రం జైతున్ బీబీ మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
Tollywood
Ali
Mother
Jaitun Bibi
Chiranjeevi

More Telugu News