Gongidi Sunitha: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత

  • చెక్కుల పంపిణీ కోసం వచ్చిన సునీత
  • ఊడి కిందకు పడ్డ స్లాబ్ పెచ్చులు
  • మరో మహిళకు తీవ్ర గాయాలు
ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌస్ కు సునీత వచ్చారు. అదే సమయంలో గెస్ట్ హౌస్ స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ ఘటనలో సునీత చేతికి పెచ్చు తగిలి గాయమైంది. ఇందిర అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరినీ ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Gongidi Sunitha
TRS

More Telugu News