Vijay Sai Reddy: పేపర్ నిండా విషపు రాతలు రాశాడు: విజయసాయి రెడ్డి విమర్శలు

  • బాబు కంటే కూడా కిరసనాయిలు తెగ ఫీల్ అయినట్టున్నాడు
  • రాజధానిని వికేంద్రీకరిస్తే హైదరాబాద్ లాభపడుతుందట
  • ఇందులో ఏమైనా లాజిక్ ఉందా?
  • కర్నూలు, విశాఖలు అభివృద్ధి చెందొద్దనేది వీళ్ల ఏడుపు 
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఓ పత్రికలో వచ్చిన వార్తలపట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.

'అమరావతి విషయంలో బాబు కంటే కూడా కిరసనాయిలు తెగ ఫీల్ అయినట్టున్నాడు. పేపర్ నిండా విషపు రాతలు రాశాడు. రాజధానిని వికేంద్రీకరిస్తే హైదరాబాద్ లాభపడుతుందట. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? కర్నూలు, విశాఖలు అభివృద్ధి చెందొద్దనేది వీళ్ల ఏడుపు' అని విజయసాయి రెడ్డి ఓ మీడియా అధినేతను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh
amaravati

More Telugu News