Andhra Pradesh: ఆస్తులు, భూములు పోతాయనేదే టీడీపీ నేతల భయం: మంత్రి కన్నబాబు

  • సీఎం స్పష్టమైన వైఖరి వెలిబుచ్చారన్న కన్నబాబు
  • జగన్ టీడీపీ తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నారని వ్యాఖ్యలు
  • పవన్ పైనా విమర్శలు
ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించారని, ఆస్తులు, భూములు పోతాయన్న భయంతోనే టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో ఏ జిల్లాకైనా చెప్పుకోదగిన ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకువచ్చారా? అని నిలదీశారు.  గత ఐదేళ్లలో టీడీపీ చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ పైనా కన్నబాబు స్పందించారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనా మీ ఉద్దేశం? అభివృద్ది వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి? మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Andhra Pradesh
Amaravathi
Telugudesam
YSRCP
Jagan
Kannababu

More Telugu News