AP Capital Area villages farmers protests: ఏపీ రాజధాని గ్రామాల్లో రేపు బంద్ కు పిలుపునిచ్చిన రైతులు

  • ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన పట్ల ఆగ్రహం
  • నిరసనల్లో భాగంగా రిలే దీక్షలు, రహదారుల ముట్టడికి నిర్ణయం
  • ఆందోళనలో అన్ని గ్రామాల రైతులు పాల్గొంటారని వెల్లడి
రాజధాని గ్రామాల్లో రేపు బంద్ పాటించాలని రైతులు నిర్ణయించారు.  ఏపీకి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం పట్ల అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు రైతులు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. తాజాగా రైతులు ఉద్దండరాయనిపాలెంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై రాజధాని సమాలోచనలు జరిపారు. రాజధాని గ్రామాల్లో రేపు బంద్ పాటించాలని రైతులు పిలుపు నిచ్చారు. నిరసనల్లో భాగంగా రిలే దీక్షలు, రహదారుల ముట్టడి చేపట్టాలని తీర్మానం చేసుకున్నారు. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ.. ఆందోళనలో పాల్గొనాలని అన్ని గ్రామాల రైతులు నిర్ణయించారు.
AP Capital Area villages farmers protests
Tommorow Bandh to be conducted by farmers
Andhra Pradesh

More Telugu News