JC Diwakar Reddy: అచ్చం రాజారెడ్డి లాంటివాడే ఈ జగన్: జేసీ

  • చంద్రబాబు అనంతపురం పర్యటన
  • జేసీ ట్రేడ్ మార్క్ ప్రసంగం
  • మావాడి సంగతి మీకు తెలియదంటూ వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన ట్రేడ్ మార్కు వ్యాఖ్యలు చేశారు. జగన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి గమనిస్తున్నానని, అచ్చం తన తాత రాజారెడ్డి లాంటి వాడని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న మంచిబుద్ధిలో 10 శాతం కూడా జగన్ కు లేదని అన్నారు. వైఎస్సార్ తో ఉన్న స్నేహం వల్ల జగన్ ఎలాంటివాడో తనకు తెలుసని, ఈ విషయం చంద్రబాబుకు పామిడి బహిరంగ సభలోనే చెప్పానని వివరించారు. మావాడి సంగతి మీకు తెలియదు అంటూ ప్రసంగించారు. చంద్రబాబు అనంతపురంలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

JC Diwakar Reddy
Chandrababu
Jagan
Anantapur District
Telugudesam
YSRCP

More Telugu News