Hyderabad: హైదరాబాద్ గోకుల్ థియేటర్లో టికెట్లు అమ్మిన రాశీ ఖన్నా

  • ప్రతిరోజూ పండగే ప్రమోషన్స్ లో రాశీ ఖన్నా
  • డిసెంబరు 20న వరల్డ్ వైడ్ రిలీజ్
  • సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో చిత్రం
తమ సినిమాల ప్రచారం కోసం నటీనటులు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనడం ఈ మధ్య తరచుగా కనిపిస్తోంది. తాజాగా ప్రతిరోజూ పండగే చిత్రం కోసం హీరోయిన్ రాశీ ఖన్నా కూడా రంగంలోకి దిగింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుండడంతో రాశీ ఖన్నా హైదరాబాదులోని గోకుల్ థియేటర్ లో టికెట్లు విక్రయించారు. రాశీ ఖన్నా బుకింగ్ కౌంటర్ లో ఉందన్న విషయం ఆనోటా ఈనోటా పాకిపోవడంతో కుర్రకారు గోకుల్ థియేటర్ కు పోటెత్తింది. రాశీ ఎంతో ఓపిగ్గా అభిమానులకు టికెట్లు అమ్ముతూ తన చిత్రానికి పబ్లిసిటీ చేసుకుంది.
Hyderabad
Gokul Theater
Pratiroju Pandage
Saidharam Tej
Raashi Khanna
Maruti

More Telugu News