TTD: గొల్ల మండపాన్ని ఒక్క అంగుళం కదిలించినా పోరాటమే: టీటీడీకి స్పష్టం చేసిన యాదవ సంఘం నేతలు

  • టీటీడీని అడ్డుకుంటామన్న నేతలు
  • యాదవుల మనోభావాలు దెబ్బతీయొద్దని సూచన
  • గొల్ల మండపంపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్
తిరుమల శ్రీవారి క్షేత్రంలోని గొల్ల మండపంపై యాదవ సంఘం నేతలు స్పందించారు. గొల్ల మండపం పరిస్థితిపై టీటీడీ స్పష్టమైన ప్రకటన చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి ఒక్క అంగుళం పక్కకు తరలించాలని ప్రయత్నించినా కచ్చితంగా అడ్డుకుని తీరుతామని, టీటీడీకి వ్యతిరేకంగా పోరాడతామని యాదవ సంఘం నేతలు హెచ్చరించారు. గొల్ల మండపాన్ని అఖిలాండం వద్దకు తరలింపు ప్రయత్నం నిజమే అయితే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని, యాదవుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. గొల్ల మండపాన్ని కాపాడుకునేందుకు తాము గొల్ల మండపం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని, అధికారులతో సంప్రదింపులు జరుపుతామని నేతలు వెల్లడించారు. తమ అభిప్రాయాన్ని ఈ నెల 28న టీటీడీ పాలకమండలి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
TTD
Tirumala
Tirupati
Golla Mandapam
Akhilandam

More Telugu News