Vijay Sai Reddy: యజమాని కంటే ముందే బానిస మొరుగుతున్నాడు: పవన్ కల్యాణ్ పై విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • మూడు నగరాలెలా కడతారని అజ్ఞానాన్ని చాటుకున్నాడు
  • కర్నూలు, విశాఖ అభివృద్ధి చెందిన నగరాలు
  • అమరావతిని ఎటూ కాకుండా చేసిన పాపం చంద్రబాబుదే 
అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదని, మరి జగన్ రెడ్డి గారు అంటోన్న మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. 'రాజధాని మూడు చోట్ల ఉంటే తప్పేమిటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అలా అన్నారో లేదో యజమాని కంటే ముందే బానిస మొరుగుతున్నాడు. అమరావతికే దిక్కులేదు మూడు నగరాలెలా కడతారని అజ్ఞానాన్ని చాటుకున్నాడు. కర్నూలు, విశాఖ  అభివృద్ధి చెందిన నగరాలు. అమరావతిని ఎటూ కాకుండా చేసిన పాపం చంద్రబాబుదే' అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు నాయుడిపై కూడా విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మద్య నిషేధాన్ని తప్పుపట్టేలా మాట్లాడతాడు. ధరలెలా పెంచుతారని గద్దిస్తాడు. లక్ష కోట్లతో రాజధానిని ఒకే చోట నిర్మించాల్సిన అవసరమేమిటని అంటే దానికీ అడ్డుపడతాడు. చంద్రబాబుకి ఎంత సేపూ తనవాళ్ల వ్యాపారాలు ఏమైపోతాయో అన్న ఆందోళన తప్ప రాష్ట్రం ఏమైపోయినా పట్టదు' అని ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Pawan Kalyan

More Telugu News