CP AjaniKumar: బంజారాహిల్స్‌ పోలీసులు లైంగికంగా వేధించారని దంపతుల ఆరోపణ.. మతిస్థిమితం కోల్పోయి అలా మాట్లాడామంటూ మరో వీడియో!

  • పోలీసులపై అసత్య ఆరోపణలు చేసిన అట్లూరి సురేష్ దంపతులు 
  • క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల
  • పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశామని వివరణ
బంజారా హిల్స్ పోలీసులపై అసత్య ఆరోపణలు చేసిన విజయవాడకు చెందిన అట్లూరి సురేష్ దంపతులు... వాళ్లు చేసిన మోసాలు అన్నీ బయటపడటంతో తప్పు చేసినట్లు ఒప్పుకున్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

తమ ఆరోపణల్లో నిజం లేదని, మతిస్థిమితం కోల్పోయి అలా మాట్లాడామంటూ ఆ వీడియోలో అట్లూరి సురేష్ దంపతులు పేర్కొన్నారు. తాము ఇష్టం వచ్చినట్లు మాట్లాడామని, మీడియా సమయాన్ని వృథా చేశామని, తమను క్షమించాలని చెప్పారు. బంజారాహిల్స్‌ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశామని, ఈ విషయంపై తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.

కాగా, హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో నివసిస్తోన్న అట్లూరి సురేష్‌, ప్రవిజ దంపతులు తాము  ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేగాక, తమను అక్కడ నిర్బంధించి లైంగికంగా వేధించారని సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆ దంపతులు చేసిన అరోపణలు నిజం కాదని ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు.
CP AjaniKumar
Hyderabad
Crime News

More Telugu News