Hyderabad: ఏసీబీ వలలో అవినీతి చేప.. సిద్ధిపేట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డికి సంబంధించి రూ.5 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు

  • అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు 
  • హైదరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్ లోని నివాసాల్లో తనిఖీలు
  • బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు
  • బ్యాంక్ లాకర్, హైదరాబాద్ లోని విల్లా, ఇంటి స్థలాల గుర్తింపు
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. సిద్ధిపేట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోన్న ఈ సోదాల్లో ఇప్పటివరకు నర్సింహారెడ్డికి సంబంధించిన రూ.5 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.

హైదరాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి లోని నర్సింహారెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నర్సింహారెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్, హైదరాబాద్ లోని విల్లా, ఇంటి స్థలాలను అధికారులు గుర్తించారు. సిద్ధిపేట వన్‌టౌన్ కానిస్టేబుల్ సాంబిరెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.
Hyderabad
Siddipet District
Police

More Telugu News