Kesineni Nani: అసెంబ్లీలో నవ్వు ఆపుకోలేకపోయిన జగన్.. వీడియోను పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన కేశినేని నాని

  • చంద్రబాబు ప్రసంగిస్తుండగా జగన్ నవ్వు
  • పిచ్చి వాడి చేతిలో రాయి జగన్ చేతిలో రాజధాని
  • రెండిటికీ ఏమీ తేడా లేదు
  • ఎటు విసురుతారో ఎక్కడ పడుతుందో దేవుడికి కూడా తెలియదు 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ విరగబడి నవ్విన వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పిచ్చి వాడి చేతిలో రాయి జగన్ చేతిలో రాజధాని రెండిటికీ ఏమీ తేడా లేదు.. ఎటు విసురుతారో ఎక్కడ పడుతుందో దేవుడికి కూడా తెలియదు' అని తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

కాగా, అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా జగన్ విరగబడి నవ్వారు. టీడీపీ పాలనలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని, వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం అభివృద్ది చేశామని చెప్పారు. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే జగన్ నవ్వారు.
Kesineni Nani
Chandrababu
Jagan

More Telugu News