కేంద్రం ఆడమన్నట్లు ఏఐఏడీఎంకే ఆడుతోంది: కమలహాసన్
- పౌరసత్వ సవరణ చట్టంపై ఏఐఏడీఎంకేపై విమర్శ
- మా పార్టీ ఎన్ఆర్సీని కూడా వ్యతిరేకిస్తోంది
- జాతీయ పౌరసత్వ నమోదు చట్టం సవరణపై సుప్రీం కోర్టుకు వెళతాం
ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడుతోందని ఎద్దేవా చేశారు. కమలహాసన్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జాతీయ పౌరసత్వ నమోదు చట్టం సవరణపై తమ పార్టీ సుప్రీంకోర్టుకు వెళుతుందని చెప్పిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్ఆర్సీ పై కూడా మీ పార్టీ ఇదే వైఖరి అవలంబిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు కమల్ జవాబిస్తూ.. 'అవును' అని చెప్పారు. ‘ఎప్పుడైతే ఆ ఎన్ఆర్సీ జాతీయ స్థాయిలో అమలు చేయటం ప్రారంభమవుతుందో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. మేము మైదానంలోకి దిగుతాము. ఎంతదూరమైనా ముందుకు సాగుతాము’ అన్నారు.