Vijay Sai Reddy: కన్నతల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు ఈ చిట్టి రెడ్డి: విజయసాయి వ్యాఖ్యలకు బుద్ధా కౌంటర్

  • ట్విట్టర్ లో లోకేశ్ పై విజయసాయి వ్యాఖ్యలు
  • దీటుగా బదులిచ్చిన బుద్ధా వెంకన్న
  • చిట్టి రెడ్డి అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు
చిట్టి నాయుడు అంటూ నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. చిట్టి రెడ్డి అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు సంధించారు. "చిట్టి రెడ్డి తండ్రి గెలిచిన చోట కాలర్ ఎగరేస్తాడు. కన్నతల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు. అయినప్పటికీ తనదే పైచేయి అంటాడు. దొంగ పనుల కారణంగా చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడుతుంటాడీ చిట్టి రెడ్డి... చరిత్ర మర్చిపోయారా విజయసాయిరెడ్డిగారూ!" అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

మంగళగిరిలో లోకేశ్ ను ఓడించేందుకు వైఎస్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగాల్సి వచ్చిందని, పెయిడ్ ఆర్టిస్టులు సైతం అక్కడే మకాం వేసి లోకేశ్ ఓటమి కోసం పనిచేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఒక్క మంగళగిరిలోనే వైసీపీ గెలుపు కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే వెల్లడించినందుకు ధన్యవాదాలు అంటూ స్పందించారు.
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh
Jagan
Telugudesam
YS Vijayamma
Nara Lokesh

More Telugu News