Chandrababu: చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా పెద్దిరెడ్డి సవాల్

  • ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
  • నా వ్యక్తిత్వం ఏమిటో చంద్రబాబుకు తెలుసు
  • అన్నీ తెలిసి కూడా ఆరోపణలు చేస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. శాసనసభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే... తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తనేంటో, తన వ్యక్తిత్వం ఏమిటో చంద్రబాబుకు తెలుసని... అన్నీ తెలిసి కూడా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అన్నీ క్లియర్ గా ఉన్న పనులకు బిల్లులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మరోవైపు సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఉపాధి పనుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Chandrababu
Peddireddy
Telugudesam
YSRCP

More Telugu News