Chandrababu: ఏపీ సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు ఆందోళన

  • శాంతిభద్రతలు క్షీణించాయంటూ టీడీపీ నేతల ఆందోళన
  • సీఎం తమపై దాడులు చేయిస్తూ ఆనందిస్తున్నారని ఆరోపణ
  • కక్షసాధింపే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలున్నాయని మండిపాటు
ఏపీ అన్నింటా వెనుకబడిపోయిందని, రాజకీయ కక్ష సాధింపు విధానాలే ప్రధాన అజెండాగా రాష్ట్ర పరిపాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలు సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టగా చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, సీఎం జగన్ తమపై దాడులు చేయిస్తూ సంతోషపడుతున్నారని విమర్శించారు.

పరిపాలన వదిలేసి తమపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారని, రివర్స్ పాలన కారణంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. పాలనలో సలహాదారులే చక్రం తిప్పుతున్నారని, వారికి ముడుపులు ముడితేనే ఏ పథకమైనా ముందుకు వెళుతుందని ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh
YSRCP
Jagan

More Telugu News