Jagan: జగన్ పై సభాహక్కుల నోటీసు ఇచ్చిన టీడీపీ

  • టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లని అన్న జగన్
  • అభ్యంతరకర భాష వాడారంటూ నోటీసులిచ్చిన టీడీపీ
  • స్పీకర్ తీరుపై కూడా అభ్యంతరం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ సభాహక్కుల నోటీసును ఇచ్చింది. శాసనసభ కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. నిన్నటి సభలో తమ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బఫూన్లని వ్యాఖ్యానిస్తూ అభ్యంతరకర భాష వాడారని... సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని నోటీసులో తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఇదే నోటీసులో స్పీకర్ పై కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే... పాయింటే లేదంటూ స్పీకర్ వ్యాఖ్యానిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నోత్తరాలు ప్రారంభం కావడానికి ముందే మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ మాట్లాడిస్తున్నారని ఆరోపించింది. 
Jagan
Previlage Motion
YSRCP
Telugudesam

More Telugu News