Adireddy Bhavani: మందు బ్రాండ్ల సంగతి నీకెందుకురా తల్లీ... వాళ్లు మాట్లాడతారు వదిలెయ్: టీడీపీ సభ్యురాలికి తమ్మినేని సలహా

  • అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం
  • మందుబ్రాండ్ల గురించి మాట్లాడబోయిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే
  • సభలో నవ్వులు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రజా నివాస ప్రాంతాల్లో మందు షాపులు, బార్లు ఏర్పాటు చేయరాదని, ప్రస్తుతం ఉన్నవాటిని దూరంగా తరలించాలని ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సూచించారు. ఈ సందర్భంగా ఆమె కమిషన్ కోసం కొన్ని బ్రాండ్లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రయత్నించడంతో సభలో నవ్వులు విరబూశాయి. ఇంతలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని, 'మందు బ్రాండ్ల సంగతి నీకెందుకురా తల్లీ.. వాళ్లు (మిగతా టీడీపీ సభ్యులు) మాట్లాడతారులే వదిలేయ్' అంటూ సలహా ఇచ్చారు. దీంతో సభలో మరిన్ని నవ్వులు విరిశాయి. ఆదిరెడ్డి భవానీ కూడా నవ్వాపుకోలేకపోయారు.

Adireddy Bhavani
Telugudesam
Tammineni Sitharam
YSRCP
Andhra Pradesh

More Telugu News