Chandrababu: ఆయేషా, రితేశ్వరి కేసుల్లో చంద్రబాబు ఏం చేశారు?: కన్నబాబు

  • ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించిన ఘనత చంద్రబాబుది
  • దొంగ దీక్షలకు ఎస్సీ నిధులు ఖర్చు చేశారు
  • జగన్ పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ నిధులను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. దొంగ దీక్షలకు ఎస్సీ నిధులను ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిన రోజున చంద్రబాబు అసెంబ్లీకే రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అయేషా మీరా, రితేశ్వరి కేసుల్లో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Chandrababu
Jagan
Kannababu

More Telugu News