Chittoor District: విటులుగా మగ పోలీసులు... మఫ్టీలో మహిళా పోలీసులు: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు

  • చిత్తూరులో జరుగుతున్న వ్యవహారంపై దాడి 
  • పోలీసుల అదుపులో నలుగురు యువతులు, ఓ విటుడు 
  • విద్యార్థుల ముసుగులో వ్యాపారం

విద్యార్థుల ముసుగు...సామాజిక మాధ్యమాల్లో బేరసారాలు...అంతా సజావుగా సాగాక కలుసుకునే అవకాశం ...చిత్తూరు మరకంబట్టు ప్రాంతంలో కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మగ పోలీసులు విటులుగా వెళితే, మఫ్టీలో ఆడ పోలీసులతో నిఘా పెట్టి అసలు వ్యవహారాన్ని బయట పెట్టారు. నలుగురు యువతులను, ఓ విటుడిని పట్టుకున్నారు.

పోలీసుల కథనం మేరకు...మరకంబట్టు కేంద్రంగా ఓ మహిళ ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతోంది. చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను డబ్బు ఆశచూపి ఈ కూపంలోకి లాగేది. వీరి వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి, ధర కూడా ఉంచేది. ఈ విధంగా యువతిని బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ధర నిర్ణయించేది. 

స్థానికంగా ఉన్న ఈ యువతులను కళాశాల విద్యార్థులు అనుకుని చాలా రోజులు స్థానికులు పట్టించుకోలేదు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి వీరి వ్యవహారశైలిపై అనుమానం వచ్చి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు వల వేసి ముఠా గుట్టు రట్టు చేశారు.

Chittoor District
prosistution
four arrest

More Telugu News