సినిమా వాళ్లను తక్కువ చేసి మాట్లాడతారా?: విజయసాయిపై బుద్ధా వెంకన్న ఫైర్
- ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను
- 'గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే' అన్నారు
- సినీ నటుల కష్టాన్ని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
'సినీ నటులను ఘోరంగా అవమానిస్తూ విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే అని తక్కువ చేసి మాట్లాడతారా? సినిమా రంగంలో ఉండే కష్టం మీలా ఉన్నట్టుండి అడ్డంగా ఎదిగిన వారికి ఏం తెలుస్తుంది సాయిరెడ్డి గారు? సినీ నటుల కష్టాన్ని, కళని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.