Nalgonda District: ప్రధానోపాధ్యాయుడి వేధింపులు.. కిరోసిన్ పోసుకొని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

  • నల్గొండ జిల్లా దేవరకొండ ఎంఈవో కార్యాలయం ఎదుట ఘటన
  • ప్రధానోపాధ్యాయుడు మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణ
  • ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రాంభాయిగా గుర్తింపు
నల్గొండ జిల్లా దేవరకొండ ఎంఈవో కార్యాలయానికి ఓ ఉపాధ్యాయురాలు కిరోసిన్ బాటిల్ తో వచ్చి కలకలం రేపింది. ఎంఈవో కార్యాలయం ఎదుట తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.

దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో తాను ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నానని, తనపేరు రాంభాయి అని ఆమె తెలిపింది. తాను పని చేస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
Nalgonda District
teacher

More Telugu News