Nara Lokesh: ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే.. రివర్స్ లో నడిచి అసెంబ్లీకి వెళ్లాం!: టీడీపీ నేత నారా లోకేశ్

  • ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు 
  • నవరత్నాలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి 
  • ప్రజాధనం దోపిడీని ఆపాలని అసెంబ్లీ ఎదురుగా నిరసన తెలిపాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూటకో మాట మారుస్తోందంటూ ప్లకార్డు పట్టుకొని టీడీపీ నేత నారా లోకేశ్ నిరసన తెలిపారు. ఏడు నెలల జగన్ గారి పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఏడిపించడం తప్ప సాధించింది ఏమీ లేదని అన్నారు. రివర్స్ పాలనవల్ల సంక్షేమం, అభివృద్ధి అటకెక్కాయని విమర్శించారు.

'ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి' అని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రివర్స్ పాలన, రిజర్వుడు టెండరింగ్ ద్వారా సొంత మనుషులకు ప్రజాధనం దోపిడీని ఆపాలని అసెంబ్లీ ఎదురుగా నిరసన తెలిపామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో రివర్స్ లో నడిచి అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు.
Nara Lokesh
Telugudesam
Chandrababu

More Telugu News