Chandrababu: వెనక్కి నడుస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపిన చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు.. వీడియో ఇదిగో

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో టెండర్లన్నీ రిజర్వు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అసత్యాలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డ విషయం తెలిసిందే. రాష్ట్రంలో పాలన 'రివర్స్'లో జరుగుతోందని టీడీపీ వినూత్నంగా నిరసన చేపట్టింది.

ఈ విషయంపై చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు, ఇతర టీడీపీ నేతలు ఈ రోజు ఉదయం వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ఆగిపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. రివర్స్ పాలనవల్ల రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి నిలిచిపోయాయని వారు విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News