Nehru: నెహ్రూపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ బాలీవుడ్ నటి అరెస్ట్

  • నెహ్రూ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన పాయల్ రోహాత్గీ
  • అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు
  • గూగుల్ లో ఉన్న సమాచారంతోనే వ్యాఖ్యలు చేశానన్న నటి
సుప్రసిద్ధ మోడల్, బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గీని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా పాయల్ రోహాత్గీ వ్యాఖ్యలు చేయడమే అరెస్ట్ కు దారితీసింది. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కుటుంబాన్ని, ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ అర్ధాంగిపై రోహాత్గీ వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని రాజస్థాన్ యువజన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం అనుసరించి పోలీసులు పాయల్ రోహాత్గీని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ గూగుల్ లో ఉన్న సమాచారంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, భావవ్యక్తీకరణ హక్కు ఓ జోక్ గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. పాయల్ పై చర్మేశ్ శర్మ మాత్రమే కాదు, పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఫిర్యాదులు చేశారు.
Nehru
India
Payal Rohatgi
Bollywood
Police
Rajasthan

More Telugu News