Bashid: పోలీసుల అదుపులో 'ఎవడ్రా హీరో' చిత్ర కథానాయకుడు!

  • తెలుగు చిత్రంలో హీరోగా నటించిన బషీద్
  • కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు
  • దుబాయ్ ఎంబసీ ఫిర్యాదుతో బషీద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
'ఎవడ్రా హీరో' అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఔత్సాహిక కథానాయకుడు బషీద్ కు పోలీసులు అరదండాలు వేశారు. రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బషీద్ ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాల పేరుతో డబ్బు వసూలు చేసినట్టు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి వద్ద రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్ లోని ఎస్ బీకే గ్రూప్ పేరుతో బషీద్ నకిలీ వ్యాపారం చేసినట్టు గుర్తించారు. ప్రధానంగా దుబాయ్ దౌత్య కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు రంగంలోకి దిగి బషీద్ ఆటకట్టించారు.
Bashid
Tollywood
Evadra Hero
Police
Hyderabad
Dubai

More Telugu News