Tollywood: మీ వారసుడు సినీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశముందా? అనే ప్రశ్నకు నటుడు సుమన్ స్పందన

  • నాకు ఒక కూతురు 
  • ఆమె ఎమ్మెస్సీ పూర్తి చేసింది
  • సినిమాల్లో నటించాలా? వద్దా? అనేది ఆమె ఇష్టం
1980లలో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన అందాల నటుడు సుమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీ వారసుడు సినీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా?’ అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తనకు కూతురు ఒకటే అని, ఎమ్మెస్సీ పూర్తి చేసిందని, ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకుంటోందని చెప్పారు. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్పించామని.. ప్రదర్శనలు కూడా ఇచ్చిందని చెప్పారు. సినిమాల్లో నటించాలని తన కూతురికి ఇష్టముంటే ‘ఫైన్’, అంతేతప్ప, ఒత్తిడి చేయనని చెప్పారు.
Tollywood
Artist
Sumar
cinema

More Telugu News