Andhra Pradesh: ‘ఏపీ దిశ’ తరహాలోనే దేశమంతటా ఈ చట్టం తీసుకురావాలి: బాలల హక్కుల సమితి

  • ఈ చట్టం ద్వారా ఏపీలో మహిళలకు రక్షణ 
  • మహిళలపై నేరాలకు పాల్పడాలంటే భయపడాలి
  •  ‘ఏపీ దిశ’ చట్టాన్ని తీసుకురావడం అభినందనీయం
‘ఏపీ దిశ’ తరహాలోనే దేశ మంతటా ఈ చట్టం తీసుకురావాలని బాలల హక్కుల సమితి చైర్ పర్సన్ హైమావతి కోరారు. ఈ చట్టం ద్వారా ఏపీలో మహిళలకు సీఎం జగన్ రక్షణ కల్పించారని ప్రశంసించారు. ఇలాంటి చట్టాలు ఉండటం వల్ల మహిళలపై నేరాలకు పాల్పడాలనుకునేవారికి భయం కలుగుతుందని అన్నారు. 21 రోజుల్లోనే దోషులకు శిక్షలు పడే విధంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. గతంలో సరైన చట్టాలు లేనందు వల్లే నిర్భయ, ఆయేషా మీరా ఘటనల్లో దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Disa
Nirbhaya
Ayesha mira

More Telugu News