Chandrababu: చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేతలు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ హయాంలో సలహాదారుల కన్సల్టెన్సీ పేరుతో జరిగిన దోపిడీని బయటపెడితే సిగ్గుతో తలదించుకుంటారా? అని తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూటిప్రశ్న వేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులజాడ్యం టీడీపీకే ఉందని, సలహాదారులకు కూడా కులాలు అంటగడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, తమ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీ తప్ప ఎల్లోమీడియాకు కాదు అని అన్నారు.

వైసీపీ మరోనేత గొల్ల బాబూరావు మాట్లాడుతూ, శాసనసభా సమావేశాల్లో చంద్రబాబు తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో శాసనసభలో ఏనాడూ కూడా ప్రజాసమస్యలపై చర్చ జరగలేదని, జగన్ హయాంలోనే దీనిపై సుదీర్ఘ చర్చ జరుగుతోందని అన్నారు. శాసనసభలో చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు బాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
YSRCP
Srikanthreddy
Gollababurao

More Telugu News