Amaravathi: వైసీపీ ప్రభుత్వానికి ప్రతీకారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు: టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్

  • అమరావతి విషయమై ఇచ్చిన మాట మార్చారు
  • అసత్య ప్రచారాలకు శాసనసభ వేదికగా చేసుకున్నారు
  • రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైనా ఉందా?
రాజధాని అమరావతి విషయమై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ను ఇరవై నాలుగు గంటల్లోనే మార్చడం ప్రజలను మోసం చేయడమేనని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అసత్య ప్రచారాలకు శాసనసభను వేదికగా చేసుకోవడం బాధాకరమని, రాజధానికి అడ్డుపడుతూ వైసీపీ నేతలు చారిత్రక తప్పిదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైనా ఉందా? రాజధాని లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ పాలనపై చూపడం లేదని విమర్శించారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇకనైనా వైసీపీ రంగులు వేయడం మానాలని సూచించారు.
Amaravathi
YSRCP
Telugudesam
Anagani
mla

More Telugu News