mp: విజయసాయిరెడ్డి గారూ! ఎలుక తోకను కూడ పట్టుకోలేకపోయారు: బుద్ధా వెంకన్న

  • చంద్రబాబుపై అవినీతి ఆరోపణలా?
  • మీ ఫినాయిల్ పత్రికలో రాసుకుంటే రాసుకోండి
  • కొండను తవ్వి ఎలుకను బట్టిన సామెతలా ఉంది
చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. చంద్రబాబు హయాంలో అవినీతికి పాల్పడ్డారంటూ ‘మీ ఫినాయిల్ పేపర్’లో రాసుకుని సంబరాలు చేసుకుంటామంటే మీ ఇష్టం’ కానీ అవినీతిని తవ్విస్తామంటూ సీఎం జగన్ తవ్వడం ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావొస్తోందంటూ ఓ సామెతను జోడించి విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. వెనుకటి మీలాంటి వాడే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నాడట, కనీసం, ఎలుక కాదు కదా దాని తోకను కూడా మీరు పట్టుకోలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
mp
vijayasai reddy
Budda
Venkanna
mlc

More Telugu News