Chandrababu: చంద్రబాబు ఓ నెగెటివ్ మనిషి: విజయసాయి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు ఓ నెగిటివ్ మనిషి అని అభివర్ణించిన ఆయన, చంద్రబాబునాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో జన్మించడం దురదృష్టకరమని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో తీసుకెళ్లే బదులు తిరోగమనం పట్టించేలా పయనించడం దుర్మార్గం అని పేర్కొన్నారు. వైసీపీ సర్కారుపై కావాలనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారుల బదిలీలపైనా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న తీరుతో చంద్రబాబు మనసు కష్టపెట్టుకుంటున్నారని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Vijay Sai Reddy
Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan

More Telugu News