duck: ఆడ బాతుకు స్వయం వరం.. పోస్టర్లు అతికించిన యజమాని

షార్ట్స్‌లో చూడండి
ఓ ఆడ బాతుకు మగ బాతు కావాలని ఓ వ్యక్తి స్వయం వరం ప్రకటన చేసిన విచిత్ర ఘటన అమెరికాలోని బ్లూ హిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ బాతుకు సంబంధించిన పోస్లర్లను అతికించిన దాని యజమాని మారిస్‌.. అందులో తన ఈమెయిల్ అడ్రస్ రాశాడు.  ఆయన బాతులు పెంచుకుంటున్నాడు.

అయితే, ఓ ఆడ బాతు తప్ప మిగతా బాతులన్నీ కొన్ని వారాల క్రితం మృతి చెందాయి. దీంతో మిగిలి పోయిన ఆడ బాతు బాధను చూడలేక మారిస్‌ ఈ పోస్లర్లు అతికిస్తూ మగ బాతు కోసం ప్రయత్నిస్తున్నాడు. బాతు బొమ్మ గీసి దానికి సరిపోయే మగబాతు కావాలంటూ పేర్కొన్నాడు. మగ బాతులను తీసుకొని ఆదివారం తన వద్దకు రావాలని తెలిపాడు. ఈ ప్రకటనపై పలువురు స్పందించారు. ఇప్పటికే ఆయన ఇంటికి కొందరు తమ మగబాతును తీసుకొని వెళ్లారు. 
Go Back to Shorts
duck
america

More Telugu News