Telangana: తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది: మంత్రి హరీశ్ రావు

  • మా పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
  • తెలంగాణ గడ్డపై కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదు
  • తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్, కేసీఆర్ వల్లే సాధ్యం
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండు పార్టీలు దొందూ దొందే అంటూ.. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని విమర్శించారు. ఈ రోజు సంగారెడ్డిలోని కంది మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత రామకృష్ణారెడ్డి, సర్పంచ్ విమల వీరేశం మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి పరిధిలోని ఎనిమిది మున్పిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఇక్కడి పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్, కేసీఆర్ వల్లే సాధ్యపడుతుందని చెప్పారు.
Telangana
In Sangareddy minister Harish Rao speach
No place in Telangana for Congress-BJP

More Telugu News