'దిశ' చట్టం పనికిరానిది: ఆయేషా తండ్రి ఇక్బాల్ ఆవేదన
- రేపిస్టులకు 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యంకాదు
- తన కుమార్తె ఆయేషా హత్య కేసులో విచారణకు సీబీఐ ఎన్నిరోజులు తీసుకుంటుందో ?
- ఈ కేసులో తాము తెలిపిన నిందితులను విచారించారా? అంటూ ఆగ్రహం
ఆయేషా అవశేషాలను సేకరించిన ఫోరెన్సిక్ బృందం
2007 డిసెంబర్ 27న విజయవాడ శివారులో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సత్యంబాబు నిర్దోషిగా బయటపడటంతో నేరస్థుడెవరో తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది. పన్నెండు సంవత్సరాల క్రితం ఖననం చేసిన ఆయేషా మృతదేహాన్ని బయటకు తీసి రీ పోస్ట్ మార్టమ్ చేయించాలని సీబీఐ రంగం సిద్ధం చేసింది.
ఈ క్రమంలో ఈ రోజు సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహం అవశేషాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. ఈ సందర్బంగా పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించినట్టు తెలుస్తోంది. పూర్తి పరీక్షల అనంతరం దీనిపై ఫోరెన్సిక్ బృందం ఒక నివేదికను సీబీఐకు సమర్పించనుంది.