Dhoni will not retire Till: క్రికెట్ కు ధోనీ వీడ్కోలు చెప్పడని నాకు విశ్వాసముంది: విండీస్ క్రికెటర్ బ్రావో
- 2020లో జరిగే ప్రపంచకప్ లో ఆడతాడు
- ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడాను
- సామర్థ్యంపై విశ్వాసముంచాలని చెప్పేవాడు
జార్ఖండ్ డైనమైట్ గా పేరుపొందిన భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ కు గుడై బై చెప్పడని వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ద్వానే బ్రావో అన్నాడు. ధోనీ 2020లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ లో ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్రావో ఐపీఎల్ లో సీఎస్ కే జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్ కే జట్టు కెప్టెన్ గా ఉన్న ధోనీ మనస్తత్వం తనకు తెలుసని అతడు అద్భుతమైన ఆటగాడని బ్రావో పేర్కొన్నాడు.
2018లో రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో తాజాగా నిర్ణయం మార్చుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రావో మీడియాతో మాట్లాడాడు. ‘ధోనీ ఎప్పుడూ విశ్రాంతి కోరుకోలేదు. అందుకే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడతాడనే అనుకుంటున్నా. మైదానం బయట జరిగే ఘటనల ప్రభావం తనపై ఉండనివ్వడు. మాకు అదే నేర్పాడు. ఎప్పుడూ భయపడవద్దని, శక్తి సామర్థ్యంపై నమ్మకం ఉంచాలనే వాడు’ అని చెప్పాడు.