priyanka gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది.. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి: ప్రియాంకా గాంధీ

  • 'భారత్ బచావో' ర్యాలీలో మాట్లాడిన ప్రియాంక
  • ఆర్థిక వృద్ధిని కోల్పోయాం
  • ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది
  • దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది 
ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రసంగించారు. దేశంలోని అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని ఆమె విమర్శించారు.

'ఆర్థిక వృద్ధిని కోల్పోయాం. ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశ ప్రజలంతా స్పందించాల్సిన అవసరం వచ్చింది. ప్రజలు మౌనం వహిస్తే మన రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తారు. చీకటిలో, భయంలో కూరుకుపోతాం. బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారు' అని ప్రియాంక వ్యాఖ్యానించారు.

'దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది.. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఎన్నడూలేని విధంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది' అని ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు.
priyanka gandhi
Congress
New Delhi

More Telugu News