Karnataka: సినిమాకి వెళ్లిన గర్భిణికి లైంగిక వేధింపులు.. నలుగురి అరెస్టు!

  • వెళ్లేటప్పుడు వేధిస్తే ఎదురు తిరిగిన మహిళ 
  • సినిమా పూర్తయ్యాక కారులో కిడ్నాప్
  • తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

గర్భిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేకాక ఆమెను లైంగికంగా వేధించిన నలుగురు యువకులను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రం తిరువనమలాయిజిల్లా  చెంగం తాలూకా పుదుప్పాళ్యం పంచాయతీకి చెందిన ఐదు నెలల గర్భిణి స్థానికంగా ఉన్న థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లింది. దీన్ని గమనించిన నలుగురు ఆమెపట్ల తొలుత అసభ్యంగా వ్యవహరించారు. అనంతరం లైంగికంగా వేధించడంతో ఆమె ఎదురు తిరిగింది. దీంతో తోకముడిచిన యువకులు ఆమెను వదిలేశారు. ఆమె సినిమా థియేటర్లోకి వెళ్లిపోయింది.

సినిమా పూర్తయి బయటకు వచ్చేసరికి ఆమె కోసం చూస్తున్న సదరు యువకులు బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించి తీసుకువెళ్లారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధ్యులైన యువకులు ప్రశాంత్, రాజముత్తు, మునుస్వామి, ప్రభాకర్లను అరెస్టు చేసి జైలుకు పంపారు.

Karnataka
sexual herasment
pregnent
four arrest

More Telugu News