Ruler: విశాఖలో నేటి సాయంత్రం ‘రూలర్’ ఆడియో వేడుక

  • ఎంజీఎం పార్క్‌లో సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం
  • పోస్టర్‌ను విడుదల చేసిన సిటీ అధ్యక్షుడు శంకర్
  • హాజరు కానున్న బాలకృష్ణ, చిత్ర బృందం
నేటి సాయంత్రం విశాఖపట్టణంలో ‘రూలర్’ సినిమా ఆడియో వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ విశాఖ సిటీ అధ్యక్షుడు కె.శంకర్‌, టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్‌, ఆలిండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్‌ కన్వీనర్‌ తిలక్‌లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలోని ఎంజీఎం పార్క్‌లో సాయంత్రం ఐదు గంటలకు ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నటుడు బాలకృష్ణతోపాటు చిత్రబృందం ఈ కార్యక్రమానికి హాజరవుతుందని పేర్కొన్నారు. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Ruler
Balakrishna
Visakhapatnam
Audio release

More Telugu News