Telugudesam: ఒక ఫ్యాక్షన్ నేత అధికారం చేపడితే ఎలా ఉంటుందో అలా ఉంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • గత చరిత్ర చూస్తే జగన్ నేరస్తుడు
  • జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వం వదల్లేదు
  • అందుకే రాజకీయంగా, అధికారులపైనా కక్షసాధింపు
ఏపీలో ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపిస్తున్నారు. తాజాగా, ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఒక ఫ్యాక్షన్ నేత అధికారం చేపడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు.

గత చరిత్ర చూస్తే జగన్ నేరస్తుడు, ఆయనపై పలు కేసులు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రం దురదృష్టమో, ప్రజల దురదృష్టమో తెలియదు గానీ ఆయన్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని వదలని జగన్ రాజకీయంగానే కాదు అధికారులపైనా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని, నేడు జగన్ పాలనలో అలా లేదని విమర్శించారు.
Telugudesam
Gorantla Butchaiah Chowdary
Jagan

More Telugu News