Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాల బస్సు లో మంటలు.. విద్యార్థులు సురక్షితం

  • పశ్చిమ గోదావరి జిల్లా మీనానగరం వద్ద ఘటన
  • అకస్మాత్తుగా ఇంజన్ లోంచి పైకెగిసిన  మంటలు
  • డ్రైవర్ విద్యార్థులను దింపివేయడంతో తప్పిన ముప్పు
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సు దగ్ధమైన ఘటనలో విద్యార్థులు బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పిపోయింది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు 25 మంది విద్యార్థులతో చాగల్లు బయలు దేరింది.

మీనా నగరం సమీపం నుంచి బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సు ఇంజన్ లోంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా ఆపి విద్యార్థులను కిందకు దించివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు రేగాయని తెలుస్తోంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
Andhra Pradesh
West Godavari District
Near Meenanagarm School bus fire accident
students excaped from the Incident

More Telugu News