Amaravathi: రాజధాని అమరావతిని మార్చడం లేదన్న మంత్రి బొత్స

  • రాజధాని అంశంపై శాసనమండలిలో ప్రశ్నించిన టీడీపీ  
  • అందుకు సమాధానమిచ్చిన మంత్రి బొత్స
  • రాజధానిని మార్చడం లేదని స్పష్టీకరణ
ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందో, తరలిస్తారో అన్న అనుమానాలకు తెరపడింది. ఈ విషయమై శాసనమండలిలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా? అని ఇవాళ శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజధానిని మార్చడం లేదని ప్రకటించారు. అమరావతి కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల వివరాల గురించి టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, రాజధాని మార్పు అంశంపై ఇన్నాళ్లూ ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. మంత్రి బొత్స సమాధానంతో రాజధానిగా అమరావతే కొనసాగుతుందన్న విషయం తేలిపోయింది.
Amaravathi
Minister
Botsa Satyanarayana
Telugudesam

More Telugu News