Telugudesam: నన్ను ఎర్రగడ్డకు పంపిస్తే.. అచ్చెన్నాయుడుని వెటర్నరీ ఆసుపత్రిలో చేర్చాలి: మంత్రి కొడాలి నాని కౌంటర్

  • కేంద్రం ఏపీకి ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని ఇచ్చింది
  • అమరావతిలోచంద్రబాబు పేరిట దాన్ని ప్రారంభించాలి
  • అందులో మొట్టమొదటి పేషెంట్ గా బాబుని చేర్చాలి
ఏపీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చమని చెప్పిన అచ్చెన్నాయుడిని ఏదైనా వెటర్నరీ ఆసుపత్రిలో చేర్చితే మంచిదని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని ఇచ్చినట్టు తమ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చెబితే విన్నానని, ఆ ఆసుపత్రిని అమరావతిలో ‘శ్రీ నారా చంద్రబాబునాయుడు మానసిక వైకల్య కేంద్రం’గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ని కోరుతున్నానంటూ సెటైర్లు విసిరారు. ఆ ఆసుపత్రిలో మొట్టమొదటి పేషెంట్ గా చంద్రబాబుని, ఆయనతో పాటు పిచ్చెక్కితిరుగుతూ మార్షల్స్ ను కొడుతున్న వాళ్లనూ ఈ ఆసుపత్రిలో చేర్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ విరగబడి నవ్వారు.
Telugudesam
Atchanaidu
YSRCP
kodali nani

More Telugu News