Kannababu: పక్క రాష్ట్రంలో ఘటన జరిగితే మన రాష్ట్రంలో చట్టం తీసుకువస్తున్నాం: ఏపీ మంత్రి కన్నబాబు

  • దిశ చట్టం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
  • సభలో మాట్లాడిన కన్నబాబు
  • సీఎం జగన్ పై ప్రశంసలు
దిశ చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో మాట్లాడారు. పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగితే, మన రాష్ట్రంలో చట్టం తీసుకువచ్చామని, దేశంలో మరే రాష్ట్రం ఈ విధంగా తీసుకురాలేకపోయిందని అన్నారు. మహిళలు భయం లేకుండా ఉండాలంటే దిశ వంటి కఠినమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్భయ ఘటనలో జైల్లో ఉన్న కిరాతకులు సిక్స్ ప్యాక్ కండలు పెంచి తిరుగుతున్నారని, ఇలాంటివి చూస్తుంటే బాధిత కుటుంబాల ఆవేదన అంతాఇంతా కాదని తెలిపారు.

ప్రజలు కోరుకునే తీర్పునే సీఎం జగన్ తీసుకువస్తున్నారని, గొప్ప సంస్కరణకు శ్రీకారం చుట్టారని కన్నబాబు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపైనా ఆయన విమర్శలు చేశారు. మహిళలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలన్న నేతలు ప్రతిపక్షంలో సభ్యులుగా కొనసాగుతున్నారని చురక అంటించారు. 
Kannababu
Andhra Pradesh
Disha
YSRCP
Jagan
Telangana

More Telugu News